Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila : సైబర్ క్రైం పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు..8 మందిపై కేసు నమోదు

YS Sharmila : సైబర్ క్రైం పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు..8 మందిపై కేసు నమోదు

YS Sharmila : సైబర్ క్రైం పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు..8 మందిపై కేసు నమోదు
X

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు నటి శ్రీరెడ్డి సహా 8 మందిపై హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు కేసులు నమోద చేశారు. నిరాధరమైన పోస్టులతో తనను అమానస్తున్నారిని పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆ పోస్టులకు సంబంధించిన పీడీఎఫ్‌లను సైతం పోలీసులకు ఆమె అందజేశారు. అసభ్యకర వ్యాఖ్యలు, పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుతుననారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో షర్మిల పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు, పెడుతూ తనను మానసికంగా వేధిస్తున్నారంటూ షర్మిల ఫిర్యాదు పత్రాన్ని పోలీసులకు బ్రదర్ అనిల్ కుమార్ అందజేశారు.

ఈ మేరకు నటి శ్రీరెడ్డితోపాటు వర్రా రవీందర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్, మేదరమెట్ల కిరణ్ కుమార్, రమేశ్ బలగాకుల, ఆదిత్య సత్యకుమార్ దాసరి, సేనాని, మహ్మద్ రెహ్మత్ పాషాపై షర్మిల ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం కోసం తమ పార్టీ చేస్తున్న పోరాటం కోసం వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రెండు ప్రాంతీయ పార్టీలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయని, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని షర్మిల అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందని, ఇలాంటి దుష్ట శక్తులను ఓడించేందుకు కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ చేతులు కలిపిందన్నారు.




Updated : 26 Feb 2024 5:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top