Home > ఆంధ్రప్రదేశ్ > తీరం దాటిన మిగ్జాం తుఫాను.. భారీగా ఆస్తి నష్టం

తీరం దాటిన మిగ్జాం తుఫాను.. భారీగా ఆస్తి నష్టం

తీరం దాటిన మిగ్జాం తుఫాను.. భారీగా ఆస్తి నష్టం
X

మిగ్‌జాం తుఫాను బాపట్ల సమీపంలో తీరం దాటింది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నారు. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మరో రెండు గంటల్లో మిగ్ జా తుఫానుగా బలహీనపడనుంది. ఆ తర్వాత మరో 6గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావారణ శాఖ అధికారులు ప్రకటించారు. తుఫాను తీరం దాటినప్పటికీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుఫాను ప్రభావంతో ఏపీ తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు, ఈదురు గాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లోనూ తుఫాన్ ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను ప్రభావంతో ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి నేల కూలాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్, మంచినీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది.

Updated : 5 Dec 2023 1:18 PM GMT
Tags:    
Next Story
Share it
Top