Home > ఆంధ్రప్రదేశ్ > Ambati Rambabu: భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ స్టెప్పలు

Ambati Rambabu: భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ స్టెప్పలు

Ambati Rambabu: భోగి వేడుకల్లో  మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ స్టెప్పలు
X

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ భోగి పండుగ సందర్భంగా వాడవాడలా ప్రజలు భోగి మంటలు వేసుకుంటూ నృత్యాలు చేస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు.

భోగి సంబురాల్లో మంత్రి రాంబాబు మరోసారి మహిళలతో కలిసి 'కళ్లజోడు కాలేజీ పాప చూడు' అంటూ మాస్ పాటలకు స్టెప్పులేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ అందరిలో ఉత్సాహం నింపుతూ చిందులేశారు.

ఈ సందర్భంగా ఆయనను ఓ విలేకరి మీరు సంబురాల రాంబాబు అని ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి.. అందుకు మీరేమంటారు అని అడగ్గా.. అవును నేను సంబురాల రాంబాబునే, నాకు ఇష్టమొచ్చినట్లుగా నేనుంటా, ప్రజలతో ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మిమ్మల్ని అనుకరించేలా సినిమాల్లో కూడా మీ వీడియోలు పెడుతున్నారు.. వాటిపై మీ స్పందన తెలియజేయాలని కోరగా.. అది సంతోషకరమైన విషయమని, తాను అంత ఎత్తుకు ఎదిగినందుకు గర్వ కారణంగా ఉందన్నారు. గత ఏడాది మంత్రి వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

Updated : 14 Jan 2024 2:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top