ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొట్టిన ఆంబులెన్స్..నలుగురు మృతి
Aruna | 15 Sept 2023 8:50 AM IST
X
X
చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి ప్రాంతంలోని జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న ట్యాంకర్‌ను అంబులెన్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆంబులెన్స్‌లో ఉన్న ఏడుగురిలో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ముగ్గురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Updated : 15 Sept 2023 8:50 AM IST
Tags: Telugu News Crime News Andhra Pradesh Chittoor AP news Latest news Ambulence Tanker Tavanampalli Mandal tellagundlapalli Road accident
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire