Home > ఆంధ్రప్రదేశ్ > శ్రావణ శుక్రవారం గిరినాగులను కొట్టి చంపారు..ఇప్పుడేమో..

శ్రావణ శుక్రవారం గిరినాగులను కొట్టి చంపారు..ఇప్పుడేమో..

శ్రావణ శుక్రవారం గిరినాగులను కొట్టి చంపారు..ఇప్పుడేమో..
X

అరుదైన జాతికి చెందిన గిరినాగులు భీకరమైన అరణ్య ప్రాంతాల్లో మాత్రమే సంచరిస్తుంటాయి. ఈ పాములు అత్యంత భయంకరమైనవి. ఇవి మనుషులను చూస్తే ఒక్కసారిగా ఎగిరి పడతాయి. ఇక ఇవి మనిషిని కాటేస్తే అంతే సంగతి. మరి అలాంటి పాము జనావాసాల్లో సంచరిస్తూ జనాలు ఊరుకుంటారా అది ఏం చేస్తుందో అన్న భయంతో దాన్ని కొట్టిచంపుతారు. అలాంటి సంఘటనే తాజాగా విజయనగరంలో జరిగింది. 13 అడుగుల పొడవున్న అరుదైన గిరినాగు బుసలు కొడుతూ హల్ చల్ చేయడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతలోనే అదే జాతికి చెందిన మరో ఏడు అడుగుల పాము అక్కడికి చేరుకోవడంతో ఊరంతా వణికిపోయింది. దీంతో వారంతా ప్రాణ భయంతో ఆ గిరినాగులను చంపేశారు.

విజయనగరం జిల్లాలోని వేపాడ మండలం ఆకుల సీతంపేట గ్రామంలో రెండు గిరినాగులు స్వైర విహారం చేశాయి. ప్రమాదకరమైన ఈ గిరినాగులు గ్రామంలో సంచరించడంతో ఊరంతా ఒక్కసారిగా వణికిపోయింది. నల్లగా, చారలతో ఉన్న 13 అడుగుల పామును చూసి ప్రజలు వణికిపోయారు. ఇది చాలదన్నట్లు రెండో పాము సైలెంట్‏గా ఎంట్రీ ఇవ్వడంతో గ్రామస్తులు ఉలిక్కి‎పడ్డారు. ప్రమాదకరమైన పాములు కావడం, ఒకసారి కరిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలియడంతో పెద్ద పెద్ద ఆర్తనాదాలతో గ్రామమంతా దద్దరిల్లింది. కొంత మంది యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి పాములపై పెద్ద కర్రలతో దాడి చేశారు. దీంతో రెండు పాములు చనిపోయాయి.

ఇదిలా ఉంటే గ్రామ పెద్దలు చనిపోయిన గిరినాగులు పరిశీలించి నిర్గాంతపోయారు. అయితే చనిపోయిన పాములు గిరినాగులు అని, శ్రావణ శుక్రవారం రోజు తమ ఊరికి వచ్చాయని తెలిపారు. ఈ పాములు శివుడి మెడలో శివతాండవం చేసే నాగుపాములు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామ మేలు కోసమే నాగుపాములు వచ్చాయన పెద్దలు భావించారు. అయితే అదే సమయంలో నాగుపాములు మృతి చెందడంతో పెద్దలు భయంతో వణికిపోయారు. గిరినాగును చంపటం అరిష్టమని, అలాంటి పాములకు శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అనంతరం వాటిని హిందూ సంప్రదాయం ప్రకారం డప్పు చప్పులతో ఊరేగించి ఖననం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

Updated : 19 Aug 2023 4:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top