Chandrababu Arrest: ముగిసిన చంద్రబాబు తొలిరోజు విచారణ
X
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును ఇవాళ (సెప్టెంబర్ 23) సీఐడీ విచారించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో సీఐడీ అధికారులు విచారణ జరిపారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది బృందం ఆయన్ను విచారించింది. ఉదయం 9:45 గంటలకు ప్రారంభం అయిన విచారణ సాయంత్ర 5 గంటలకు ముగిసింది. రెండు విడతల్లో కలిపి దాదాపు 6 గంటలపాలు చంద్రబాబు న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారించారు. విచారణకు ముందు, తర్వాత బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న బాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలని కోర్ట్ సూచించింది. శని, ఆదివారాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే విచారించాల కోర్ట్ ఆదేశించింది. విచారణ టైంలో ప్రతీ గంటలకు 5 నిమిషాల బ్రేక్ ఇవ్వాలని, తన న్యాయవాదిని కలిసే అవకాశం ఇవ్వాలని తెలిపారు. చంద్రబాబు స్టేట్మెంట్లను అధికారులు రికార్డు చేయాలని, రికార్డ్ చేసిన డేటాను సీల్డ్ కవర్ లో ప్యాక్ చేసి న్యాయస్థానానికి అందించాలని ఆదేశించారు.