Home > ఆంధ్రప్రదేశ్ > మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పిన ప్రముఖ ఆంగ్ల పత్రిక

మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పిన ప్రముఖ ఆంగ్ల పత్రిక

మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పిన ప్రముఖ ఆంగ్ల పత్రిక
X

ఏపీ మంత్రి రోజాకు ప్రముఖ ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ క్షమాపణలు చెప్పింది. తప్పు జరిగిందని చెబుతూ వివరణ ఇచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ మంత్రి రోజా సెల్వమణి.. ఆయన్ను సన్నీలియోన్‌తో పోల్చిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై స్వయంగా సన్నీ లియోన్ స్పందించినట్టు సోషల్ మీడియాలో ఓ పోస్టు వచ్చింది. సన్నీ లియోన్ పేరిట ఉన్న ఆ అకౌంట్ నుంచి ఈ వ్యాఖ్యలపై స్పందించడంతో నిజంగానే సన్నీ లియోన్ స్పందించారని చాలా మంది భావించారు.

ఆ ట్విట్టర్ హ్యాండిల్ సన్నీ లియోన్(sunny leone) పేరుమీదే ఉన్నప్పటికీ, దానికి బ్లూ టిక్(blue tick) లేదు. అది వెరిఫైడ్ హ్యాండిల్ కానప్పటికీ, సన్నీ లియోన్… రోజాకు ఘాటుగా బదులిచ్చిందంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారం సోషల్ మీడియా వరకే పరిమితం కాలేదు. మీడియాలోకీ పాకింది. పలు పత్రికల్లోనూ దీనిపై కథనాలు వచ్చాయి. డెక్కన్ క్రానికల్‌(deccan chronicle)లోనూ ఓ కథనం ప్రచురితం అయింది.ఆ తర్వాత అది ఫేక్ ట్వీట్(Fake tweet) అని తేలింది. నిజంగా అది సన్నీ లియోన్ ట్విట్టర్ హ్యాండిల్ కాదని తెలియవచ్చింది. కానీ, అప్పటికే పలు కథనాలు వచ్చేశాయి.

ఈ నేపథ్యంలోనే డెక్కన్ క్రానికల్ తాను చేసిన తప్పిదాన్ని గుర్తించింది. మంత్రి రోజాకు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా క్షమాపణలు(sorry Roja garu) చెప్పింది. వైసీపీ సీనియర్ నేత, మంత్రి రోజా సెల్వమాణి గురించి ఓ ఫీచర్ స్టోరీ లో తప్పుగా రాసినందుకు చింతిస్తున్నామని డెక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్(Sriram Karri) ట్వీట్ చేశారు. ఆ పేరడీ అకౌంట్ ట్వీట్‌ను సరిగా పరిశీలించాల్సింది కానీ, అలా చేయలేదని వివరణ ఇచ్చారు. అంతేకాదు, ఇది ఇక్కడితో ఆగి పోవాలని ఆశిస్తున్నానని, రోజా గారు సారీ అంటూ ట్వీట్ చేశారు.

Regret our mistake in a feature story regarding senior @YSRCParty leader and minister @RojaSelvamaniRK garu. A parody account tweet was not checked with the care we should have. Bucks stops with me - sorry Roja garu. @DeccanChronicle



Updated : 17 July 2023 9:33 AM IST
Tags:    
Next Story
Share it
Top