Home > ఆంధ్రప్రదేశ్ > పాత ఇటుకల కోసం ఎగబడుతున్న జనం.. ఇతర రాష్ట్రాల నుంచీ

పాత ఇటుకల కోసం ఎగబడుతున్న జనం.. ఇతర రాష్ట్రాల నుంచీ

పాత ఇటుకల కోసం ఎగబడుతున్న జనం.. ఇతర రాష్ట్రాల నుంచీ
X

భక్తులు ప్రసాదం కోసం క్యూలు కడతారు. బాబాల ఆశీర్వాదం కోసం తోసుకుంటారు. దేవుళ్ల దర్శనం కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఏపీలోని పిఠాపురంలో మాత్రం వందలాది భక్తులు పాత ఇటుకల కోసం ఎగబడుతున్నారు. ఇటుక మొత్తం దొరక్కపోయినా ఫర్వాలేదు ఒక్క ముక్క దొరికినా చాలని ఆశపడుతున్నారు. ఏపీ వాసులే కాదు, ఇరుగుపొరుగు రాష్ట్రాల భక్తులు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. అవేం బంగారం, వెండి ఇటుకలు కావు. కొత్త ఇటుకలు కూడా కావు. చాలా పాత ఇటుకలు. వాటికి మహిమ ఉందనే నమ్మకమే దీనికి కారణం.

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ సందడి నెలకొంది. శ్రీవిశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి చెందిన ఓ గోడను ఇటీవల రైతుల పొలాలకు దారి ఇవ్వడానికి కూల్చారు. ఆ గోడ ఇటుకల్లో మహత్తు ఉందని ప్రచారం జరగడంతో జనం పోటెత్తుతున్నారు. సూఫీ భక్తిభావనల ఆధారంగా ఏర్పాటైన ఈ పీఠాన్ని ఐదురు మతపెద్దలు నడిపారని, వారు తిరుగాడిన నేల కాబట్టి ఇటుకలక మహిమ ఉంటుందని భావిస్తున్నారు. ‘‘ఈ ఇటుకలను ఇంటికి తీసుకెళ్లి పూజలు చేస్తాం. ఇంటి నిర్మాణంలోనూ వాడుకుంటాం. ఇది మా దగ్గర ఉంటే అంతా మంచి జరుగుతుంది’’ అని భక్తులు చెబుతున్నారు. ఈ సూఫీ పీఠానికి రోజూ అన్ని మతాల భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఉమర్ అలీ షా అనే మతపెద్ద ప్రస్తుతం పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడా ఏటా ఫిబ్రవరిలో భక్తి ఉత్సవాలు జరుగుతుంటాయి.

Updated : 5 Aug 2023 8:09 AM IST
Tags:    
Next Story
Share it
Top