Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం.. మిస్సింగ్ కేసులు నిజమే.. కానీ: ఏపీ డీజీపీ

పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం.. మిస్సింగ్ కేసులు నిజమే.. కానీ: ఏపీ డీజీపీ

పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం.. మిస్సింగ్ కేసులు నిజమే.. కానీ: ఏపీ డీజీపీ
X

తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు వివరాలు బుధవారం (జులై 26) కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. 2019 నుంచి 2021 మధ్య తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 72, 767 మంది అదృశ్యం అయినట్లు తెలిపింది. అందులో 15,994 మంది బాలికలు, 56,773 మంది మహిళలు ఉన్నారు. తాజాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. కేంద్ర వివరించిన లెక్కలు వాస్తవమేనని అన్నారు. ఈ క్రమంలో మిస్సైన 26వేల మందిలో 23 వేల మంది ఆచూకి ఇప్పటికే గుర్తించామని, మిగిలిన 3 వేల మంది ఆచూకి త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

ఇందులో వివిధ కారణాల వల్ల అదృశ్యమైన వాళ్లు ఉన్నారు. అయితే, కొందరు రాష్ట్రంలో 30 వేల మంది అదృశ్యం అయినట్లు తప్పు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. కేంద్ర ప్రవేశపెట్టి జాబితాలో ఎంతమంది మిస్సైయ్యారో తేలిపోయింది. అందులో దాచడానికి ఏమీ లేదు. గడిచిన మూడేళ్లలో అదృశ్యం అయిన బాలికలు, మహిళల సంఖ్య 53.61 శాతం పెరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఆచూకి తెలిసిన వాళ్ల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు.

పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే:

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మిస్సింగ్ కేసుల గురించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులుగా మారి.. మహిళల అదృశ్యానికి పరోక్షంగా కారకులు అవుతున్నారని అన్నాడు. వాళ్లు తీసుకున్న డేటా ఆధారంగానే మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయని అన్నారు. దీనివల్ల ఇప్పటి వరకు 30 వేల మిస్సింగ్ కేసులు జరిగాయని, దానికి సంబంధించిన డేటా అంతా కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉందని తెలిపారు.




Updated : 27 July 2023 4:30 PM IST
Tags:    
Next Story
Share it
Top