Sharmila : ఏపీలో నియంత పాలన నడుస్తోంది షర్మిల ధ్వజం
X
విజయవాడలో వైఎస్ షర్మిల నేడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలను స్వీకరించనున్న నేపథ్యంలో కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు. అయితే ఆ ర్యాలీలోని వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ ర్యాలీ వెహికల్స్ అడ్డుకోవడంతో జగన్ ప్రభుత్వంపై షర్మిల మండిపడ్డారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెనక ఉన్న వాహనాలు వచ్చేవరకు ముందుకు వెళ్లమని షర్మిల తేల్చిచెప్పారు. అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు షర్మిల వద్దకొచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో పోలీసులు దిగొచ్చారు. షర్మిల కాన్వాయ్‌కు అనుమతి ఇచ్చారు.
రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదని తేల్చిచెప్పారు. అనుమతి తీసుకొని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఆంధప్రదేశ్‌లో నియంత పాలన నడుస్తోందని షర్మిల ధ్వజమెత్తారు. ఏపీ కాంగ్రెస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టాక షర్మిల చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వమైన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపైనా ఏవైనా విమర్శలు చేస్తారా? లేదా? అని అటు కాంగ్రెస్ నేతలతో పాటు ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, రాష్ట్ర విభజన తరువాత ప్రజల సెంటిమెంట్‌గా మిగిలిపోయిన పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై ప్రసంగంలో షర్మిల ప్రస్తావించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ను ముందుకు నడిపిన కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు వైఎస్ షర్మిల వెంట అడుగులేస్తున్నారు.