Home > ఆంధ్రప్రదేశ్ > కడుపులో అయస్కాంతాలు.. ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు

కడుపులో అయస్కాంతాలు.. ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు

కడుపులో అయస్కాంతాలు.. ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు
X

ఆ బాలుడి వయసు 9 ఏండ్లు. చాలా యాక్టివ్ గా ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా అనారోగ్యం పాలయ్యాడు. కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డాడు. ఎంతకీ తగ్గకపోవడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బాలున్ని పరిశీలించిన డాక్టర్లు కొన్ని టెస్టులుచేశారు. వాటి రిజల్ట్స్ చూసి అవాక్కయ్యారు. చివరకు ఆపరేషన్ చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు.

ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన షేక్​మహమ్మద్​ రఫీ(9) కొన్నాళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు జులై 8న గుంటూరులోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా బాలుడి కడుపులో నాలుగు అయస్కాంతాలు ఒకదానికొకటి అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు. వాటి కారణంగా చిన్న పేగులో మూడు చోట్ల, పెద్ద పేగులో ఓ చోట రంధ్రం ఏర్పడింది. దీంతో డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేశారు. సర్జరీ చేస్తున్న డాక్టర్లకు లోపల నాలుగు అయస్కాంతాలతో పాటు రకరకాల ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు, కొన్ని రకాల గింజలు గుర్తించారు. వాటన్నింటినీ బయటకు తీశారు. పాడైన పేగులను సరిచేశారు.

ఆపరేషన్ అనంతరం బాలుడు కోలుకున్నట్లు డాక్టర్లు చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. పిల్లులు కనిపించిన వస్తువులన్నింటీ నోట్లో పెట్టుకుంటుంటారని అందుకే తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని అంటున్నారు.

Updated : 16 July 2023 1:23 PM IST
Tags:    
Next Story
Share it
Top