Home > ఆంధ్రప్రదేశ్ > ఆ కులాలకు జగన్ శుభవార్త.. ఇక రూ. లక్ష

ఆ కులాలకు జగన్ శుభవార్త.. ఇక రూ. లక్ష

ఆ కులాలకు జగన్ శుభవార్త.. ఇక రూ. లక్ష
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని మైనారిటీ కులాలకు శుభవార్త చెప్పారు. నూర్‌బాషా, దూదేకుల, పింజారి, లద్దాఫ్‌ కులాల వధువులకు పెళ్లి కోసం ఇస్తున్న మొత్తాన్నిరూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. వైఎస్సార్‌ షాదీ తోఫా కింద ఇక లక్ష ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం ముస్లింలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. నూర్‌బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫులు ఇస్లాం మతాన్ని పాటిస్తున్నా బీసీ-బీ కేటగిరీలో ఉండడంతో వారికి వైఎస్సార్ కల్యాణమస్తు పథకం కింద రూ.50వేలు మాత్రమే అందిస్తున్నారు. తమను కూడా వైఎస్సార్‌ షాదీ తోఫా కిందికి తీసుకొచ్చి రూ.లక్ష చొప్పున ఆ కులాలు కొన్నాళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీంతో వారిని కూడా ముస్లింల కిందే పరిగణించి లక్ష ఇవ్వాల ప్రభుత్వం నిర్ణయించింది. కాగా గత టీడీపీ ప్రభుత్వం ముస్లింలతో పాటు దూదేకులకు కూడా దుల్హన్‌ పథకం కింద పెళ్లికి ఆర్థిక సాయం చేసేది. జగన్ ప్రభుత్వం ఆ పేరు మార్చి, సాయం పెంచింది.


Updated : 16 July 2023 12:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top