Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమలలో బ్రేక్‌ దర్శనాలు రద్దు..టీటీడీ కీలక నిర్ణయం

తిరుమలలో బ్రేక్‌ దర్శనాలు రద్దు..టీటీడీ కీలక నిర్ణయం

తిరుమలలో బ్రేక్‌ దర్శనాలు రద్దు..టీటీడీ కీలక నిర్ణయం
X

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 17వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 16న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని క్లారిటీ ఇచ్చింది. వీటితో పాటే స్వామి వారి సన్నిధిలో జరిగే పలు సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. స్వామివారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకే బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని , భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జులై 17న సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజ సామాన్య భక్తులకు ప్రాధాన్యతను ఇచ్చి వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసింది. దీంతో ఈనెల 16న ఎలాంటి వీఐపీ సిఫార్సు లెటర్లను స్వీకిరించబోమని టీటీడీ ప్రకటించింది. 17న‌ అణివార ఆస్థానం ఉండటంతో ఆ రోజు శ్రీవారి సన్నిధిలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను కూడా క్యాన్సెల్ చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోని తమకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆణివార ఆస్థానం నేపథ్యంలో 17న సాయంత్రం వేళల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని అత్యంత సుందరంగా శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపైన తిరుమల పురవీధుల్లో ఊరేగిస్తారు.



Updated : 14 July 2023 7:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top