Janasena Party: జనసేన పార్టీకి ‘గుర్తు’ను కేటాయించిన ఎన్నికల సంఘం
X
కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఆ పార్టీ గుర్తుగా మరోసారి ‘గాజు గ్లాస్’ను కేటాయించింది. ఈ విషయాన్ని జనసేన.. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులు, కార్యకర్తలతో పంచుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుతో బరిలోకి దిగనుంది. మరోసారి గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో అదే గుర్తుతో నిలబడ్డ జనసేన.. ఏపీలో 137 స్థానాల్లో, తెలంగాణలో 7 స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే రెండు రాష్ట్రాల్లో కలిపి ఒక సీట్ మాత్రమే గెలవ గలిగింది. రాజోల్ నియోజక వర్గం నుంచి రాపాక వర ప్రసాద రావు గెలుపొందారు. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించాడు. అయితే బీజేపీ కూడా కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనేది ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉందని టాక్.