Home > ఆంధ్రప్రదేశ్ > చిత్తూరు జిల్లాలో విషాదం.. భార్యాభర్తలపై ఏనుగు దాడి

చిత్తూరు జిల్లాలో విషాదం.. భార్యాభర్తలపై ఏనుగు దాడి

చిత్తూరు జిల్లాలో విషాదం.. భార్యాభర్తలపై ఏనుగు దాడి
X

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఏనుగు దాడిలో భార్యాభర్తలు గాయపడగా.. భర్త పరిస్థితి విషమించి చనిపోయాడు. ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మార్కొండయ్య(52)-అరుణమ్మ అనే దంపతులు వ్యవసాయం చేసుకంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కూడా ఎప్పటిలాగే పొలానికి వెళ్లారు. అక్కడ పనులు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బాటకు సమీపంలో ఓ ఏనుగు నిలబడి ఉంది.

దీనిని చూసుకోకుండా ఆ రైతులిద్దరూ దాని దగ్గరగా వెళ్లారు. ఆ జగరాజు ఎందుకు ఆగ్రహంగా ఉందో తెలియదు గానీ.. హఠాత్తుగా వారిపై దాడికి దిగింది. ఈ క్రమంలో భర్త మార్కొండయ్య కిందపడిపోయాడు. దీంతో ఆ ఏనుగు ఆయనను కాలితో తొక్కడం ప్రారంభించింది. అరుణమ్మ ఆ ఏనుగు బారి నుంచి ఎలాగోలా తప్పించుకుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులకు ఏనుగుదాడి విషయం చెప్పింది. దీంతో వారు కూడా వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ వారు అక్కడికి చేరుకునేలోపే మార్కొండయ్య గాయాలతో చనిపోయారు. ఏనుగుదాడి విషయాన్ని గ్రామస్తులు ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేశారు. కాగా.. పెద్దపంజాణి మండలంలో ఇటీవల కాలంలో ఏనుగు దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో ముగ్గురు రైతులు చనిపోయారు.

Updated : 20 Aug 2023 12:35 PM IST
Tags:    
Next Story
Share it
Top