ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. టెస్లా ఆఫీస్ షిఫ్ట్
X
ఎలాన్ మస్క్ తన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ట్విట్టర్ను దక్కించుకున్న నుంచి ఏదో ఒక నిర్ణయంతో బిజినెస్ సెన్సేషన్గా మారారు. ఇప్పటికే ట్విట్టర్లో సమూల మార్పులు చేశారు. తాజాగా టెస్లా ఆఫీసుకు సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్లా ఆఫీసును షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం టెస్లా ప్రధాన కార్యాలయం అమెరికాలోని డెలావర్లో ఉంది. దానిని మరో చోటుకు తరలించేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
మస్క్కు బుధవారం డెలావర్ కోర్టు షాకిచ్చింది. టెస్లా డైరెక్టర్లు నిర్ణయించిన రూ.4.5 లక్షల కోట్ల శాలరీ ప్యాకేజీ తీసుకోవడానికి మస్క్ అనర్హుడని తేల్చింది. 2018లో మస్క్ 5 బిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. దీనిపై ఓ షేర్ హోల్డర్ కేసు వేయగా.. 5 ఏళ్ల తర్వాత న్యాయస్థానం తుది తీర్పునిచ్చింది. ఈ తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే మస్క్ టెస్లా ఆఫీసును తరలించాలనే నిర్ణయం తీసుకున్నారు. టెస్లా ఆఫీసును టెక్సాస్ సిటీకి మార్చాలని మస్క్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ పోల్ కూడా పెట్టారు. డెలావర్ రాష్ట్రంలో ఎవరు సంస్థలను ఏర్పాటు చేయొద్దని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మస్క్ నిర్ణయం సంచలనంగా మారింది.