ఏపీ సర్కార్‌కు ఉద్యోగుల వార్నింగ్..బకాయిలు చెల్లించాలని డిమాండ్
X
తమకు చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు నిరసన తెలిపాయి. గుంటూరులో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాయి. ఈ తరుణంలో ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..12వ పీఆర్సీ, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీలో ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కరించకుంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. న్యాయంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన 26 వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీతాలను సకాలంలో చెల్లించకుంటే ఉద్యోగులు ఇబ్బందులు పడతారని, వారిపై ఆధారపడిన కుటుంబాల్లో సమస్యలు వస్తాయన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆందోళన చేస్తున్నామని, ప్రభుత్వ వైఖరి మారకుంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.