Home > ఆంధ్రప్రదేశ్ > మాగుంట రాఘవకు బెయిల్.. సుప్రీంకు వెళ్లిన ఈడీ

మాగుంట రాఘవకు బెయిల్.. సుప్రీంకు వెళ్లిన ఈడీ

మాగుంట రాఘవకు బెయిల్.. సుప్రీంకు వెళ్లిన ఈడీ
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రయల్‌ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తే, ఢిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టి స్టే ఇవ్వాలని కోరారు. ఈడీ దాఖలు పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ రమేశ్‌ బిందాల్‌తో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ప్రకటించింది.

అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేనందున బెయిల్ ఇవ్వాలని మాగుంట రాఘవ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం మాగుంట రాఘవకు 15 రోజుల తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే బెయిల్‌ కోసం ఆయన చూపిన కారణాలు సరైనవి కావని.. సమీప బంధువుల ఆరోగ్యం బాగోలేదని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ ప్రస్తావించింది.

Updated : 8 Jun 2023 1:37 PM IST
Tags:    
Next Story
Share it
Top