Home > ఆంధ్రప్రదేశ్ > Nellore : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. రెండు లారీలు, బస్సు ఢీ

Nellore : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. రెండు లారీలు, బస్సు ఢీ

Nellore : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. రెండు లారీలు, బస్సు ఢీ
X

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద అర్ధరాత్రి 2 గంటల సమయంలో రెండు లారీలు ఓ బస్సు ఢీకొన్నాయి. ఆగివున్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా ట్రావెల్స్ బస్సు రాగా.. లారీ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్‌ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


Updated : 10 Feb 2024 8:06 AM IST
Tags:    
Next Story
Share it
Top