నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
Vinitha | 6 March 2024 7:59 AM IST
X
X
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని వెనకగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందులో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. నిద్ర మత్తులోనే ప్రమాదంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Updated : 6 March 2024 7:59 AM IST
Tags: Nandyala road accident five killed alla gadda nallagatla highway parked lorry spot died police Hyderabad tirumala
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire