Home > ఆంధ్రప్రదేశ్ > Fibernet Case: ఫైబర్‌నెట్ కేసు.. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ

Fibernet Case: ఫైబర్‌నెట్ కేసు.. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ

Fibernet Case: ఫైబర్‌నెట్ కేసు.. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ
X

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా.. నేడు ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్‌ నెట్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు... చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ను నిరాకరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేశారు. బుధవారం(నేడు) ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలాఎం త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే, 17ఏపై స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్‌ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయం విదితమే.

స్కిల్‌ కేసుకు సంబంధించి 17-ఎ సెక్షన్‌తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఫైబర్‌ కేసు పిటిషన్‌ విచారణ వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీచేసింది. మంగళవారం సెక్షన్‌ 17-ఏపై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌కు రిఫర్‌ చేసింది. కానీ, స్కిల్‌ కేసులో చంద్రబాబు అరెస్టును, రిమాండ్‌ను ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌పై ఇవాళ్టి విచారణలో ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్‌నెట్‌ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నది సీఐడీ ప్రధాన అభియోగం. 2021లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు అయ్యింది. టీడీపీ ప్రభుత్వంలో 2015 సెప్టెంబర్‌ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందని సీఐడీ చెబుతోంది.



Updated : 17 Jan 2024 3:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top