Home > ఆంధ్రప్రదేశ్ > అచ్యుతాపురం సెజ్లో అగ్నిప్రమాదం.. స్పాట్లోనే ఇద్దరూ..

అచ్యుతాపురం సెజ్లో అగ్నిప్రమాదం.. స్పాట్లోనే ఇద్దరూ..

అచ్యుతాపురం సెజ్లో అగ్నిప్రమాదం.. స్పాట్లోనే ఇద్దరూ..
X

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుతో భారీగా మంటలు ఎగిసిపడగా.. చుట్టుపక్కల అంతా దట్టమైన పొగ కమ్మేసింది

మంటల ధాటికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించిన పోలీసులు.. ప్రమాదం ఎలాం జరిగిందనేదానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఈ ప్రమాదంపై ఆరా తీసినట్లు సమాచారం.

Updated : 30 Jun 2023 1:38 PM IST
Tags:    
Next Story
Share it
Top