శ్రీకాకుళంలో భారీ అగ్నిప్రమాదం.. 6కోట్ల ఆస్తి నష్టం..
X
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాతపట్నంలోని స్నేహ షాపింగ్ మాల్‌లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండు అంతస్తుల్లోని బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురు సజీవదహనం..
మహారాష్ట్రలోని పూణెలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పింప్రి చించ్వాడ్ మున్సిపల్ పరిధిలోని చిఖలీ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రిక్ షాప్లో దుకాణంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం అయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎలక్ట్రిక్ హార్డ్ వేర్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
#WATCH | Andhra Pradesh | Fire breaks out in a shopping mall in Pathapatnam, of Srikakulam district due to an electrical short circuit. Fire engines have reached the spot to put out the fire. Details awaited. pic.twitter.com/dx7GhFJNzr
— ANI (@ANI) August 30, 2023
#WATCH | Maharashtra | Four people died in a fire in Purnanagar area of Pimpri-Chinchwad of Pune district today. Fire gutted an electric hardware shop on the ground floor of a residential building around 5 am today.
— ANI (@ANI) August 30, 2023
(Video: Pimpri-Chinchwad Municipal Corporation Fire Department) https://t.co/it5AVRtTMk pic.twitter.com/D43G8zmieK