Home > ఆంధ్రప్రదేశ్ > నేడు టీడీపీ, జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్?

నేడు టీడీపీ, జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్?

నేడు టీడీపీ, జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్?
X

అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలను నిలబెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ కానున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.

ఈ కార్యక్రమానికి ఇరుపార్టీల సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పక్కా అని ఎప్పుడో తేల్చి చెప్పారు. తాజాగా జగన్ ను గద్దె దించేందుకు ఇరుపార్టీల నేతలు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇరుపార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే చాలాసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడుస్తామని, పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని ఇరుపార్టీల నేతలు చెబుతున్నా దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే పొత్తులపై వచ్చే వారం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పటివరకు ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు. అయితే అధికార పార్టీ అయిన వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జీల పేరుతో ఏడు జాబితాలు విడుదల చేసింది. వారే ఎన్నికల్లో నిలబడనున్నారని, పార్టీ అభ్యర్థులని చెప్పకనే చెబుతోంది. టీడీపీ, జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇరుపార్టీల నేతలు కొందరికి ప్రజల్లో బాగా తిరగాలని సూచనలు ఇస్తున్నారు. కానీ ఎక్కడా అభ్యర్థుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తే.. పార్టీ కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అనుకుంటున్నారు. బీజేపీతో పొత్తును దృష్టిలో ఉంచుకుని..కొన్నింటికి అభ్యర్థుల్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Updated : 24 Feb 2024 2:18 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top