రెండు కేజీల పులస.. ఎన్నివేలు పలికిందంటే..!
X
మటన్, చికెన్ లో ఎన్ని వెరైటీలున్నా.. కొందరు సీ ఫైడ్ వైపు మొగ్గు చూపుతారు. అందులో ముఖ్యంగా పులస చేపకు యమ క్రేజ్ ఉంటుంది. పులస ఇగురు, పులస పులుసు వండితే.. ఇక అంతే. ఎగబడి తింటారు. ప్రస్తుతం పులస సీజన్ మొదలయింది. యానాంలోని గోదావరిలోకి ఎర్ర నీరు పోటెత్తడంతో.. పులస చేప లభ్యం అయింది. గోదావరికి చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి మొదటి పులస చేప చిక్కింది. వేలం వేలం వేయగా.. రికార్డ్ ధర పలికింది.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో గోదావరిలో చేపల వేటకు వెళ్లిన జాలరికి రెండు కేజీలున్న మొట్టమొదటి పులస చిక్కింది. దాన్ని మార్కెట్ కు తీసుకొచ్చి వేలంపాడగా రూ. 13వేలు పలికింది. అనంతరం ఆ చేపను భీమవరానికి చెందిన వ్యక్తి రూ. 15వేలు పెట్టి కొనుకున్నాడు. ఈ ఏడాది గోదావరికి వరద లేటుగా రావడంతో పులస జాడ తగ్గింది. దాంతో పులస దొరకడం ఇంకాస్త లేట్ అయింది. దాంతో పులస ప్రియులు ఇంతకాలం ఎదురుచూశారు.