Home > ఆంధ్రప్రదేశ్ > చిరుత పోయి ఎలుగుబంటి వచ్చే....

చిరుత పోయి ఎలుగుబంటి వచ్చే....

చిరుత పోయి ఎలుగుబంటి వచ్చే....
X

తిరుమలలో పాపను చంపిన చిరుతను ఎట్టకేలకు ఇవాళ పట్టుకున్నారు. కానీ అది సృష్టించిన భయం ఇంకా వెన్నాడుతూనే ఉంది. గాల్లో కలిసిపోయిన పాప ప్రాణాలు కళ్ళముందు కదలాడుతూనే ఉన్నాయి. స్వామివారి దర్శనానికి వెళుతున్నా భయం భయంగానే మెట్లు ఎక్కుతున్నారు. మొత్తానికి ఈ సంఘటన నుంచి ప్రజలు ఇంకా తేరుకున్నదే లేదు. అంతలోనే ఎలుగుబంటి కనిపించి భక్తులను భయపెట్టింది.

తిరుమలలో శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఎలుగుబంటి కనిపించింది. ఉదయం 2వేల మెట్టు దగ్గర భక్తులు దీన్ని చూశారు. అక్కడకు దగ్గరలోనే ఉన్న అడవిలోంచి రావడం వీరు గమనించారు. వెంటనే అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో అధికారులు వెంటనే అనౌన్స్ చేసి భక్తును అప్రమత్తం చేశారు. అయితే ఎలుగు ఎవరికీ ఎటువంటి హాని చేయకుండా అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది.





మరోవైపు తిరుమలలో మరో 5 చిరుతలు తిరుగుతున్నాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో సాయంత్రం తరువాత భక్తుల సంఖ్య తగ్గించాలని ఆలోచిస్తున్నారు. ఈమధ్య కాలంలో తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో వన్యప్రాణుల సంచారం ఎక్కువైంది. జింకలు ఎప్పటి నుంచో కనిపిస్తున్నా...ఎలుగుబంట్లు, చిరుతలు కనిపించడం ఇప్పుడు ఎక్కువ అయింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు భయపడుతున్నారు. అయితే టీటీడీ దీనికి తగ్గ చర్యలు తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. శేషాచలం అడవుల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని...చిరుతలు పట్టుబడితే ఎస్వీ జూపార్క్కు తరలిస్తామని చెప్పారు. ఈరోజు ఉదయం పట్టుబడ్డ ఆడ చిరుతకు నాలుగేళ్ళని...ఇంతకు ముందు బాలుడి మీద దాడి చేసిన చిరుత, ఇది ఒకటేనా....అన్నది పరిశీలిస్తున్నామని అన్నారు.





Updated : 14 Aug 2023 10:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top