Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ మాజీ మంత్రి చినరాజప్ప కారుకు ప్రమాదం

ఏపీ మాజీ మంత్రి చినరాజప్ప కారుకు ప్రమాదం

ఏపీ మాజీ మంత్రి చినరాజప్ప కారుకు ప్రమాదం
X

ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్పకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లడంతో కారులో ఉన్నవారంతా టెన్షన్ పడ్డారు. అయితే కారు డివైడర్‌పై కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదం నుంచి చినరాజప్ప క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం వేరే కారులో చినరాజప్ప అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో మాజీ మంత్రి చినరాజప్పకు పెద్దాపురం టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు పెద్దాపురంలో ర్యాలీగా వెళ్లిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది.

చినరాజప్ప కారు బానెట్ పై గజమాల వేసి అభిమానులు, కార్యకర్తలు ఊరేగించారు. ఆ తరుణంలోనే దర్గా సెంటర్ వద్ద సడెన్ గా అడ్డువచ్చిన వ్యక్తిని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా కారు పక్కకు తిరిగింది. ఉన్నట్టుంది ఆ కారు డివైడర్ పైకెక్కి కాస్త దూరంలో ఆగింది. వెంటనే స్పందించిన కార్యకర్తలు చినరాజప్పను బయటకు తీసి మరో కారులో ఇంటికి పంపించారు.


Updated : 25 Feb 2024 9:32 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top