సీఎం జగన్‌తో బాలినేని భేటీ..
X
వైసీపీలో కలకలం రేపుతున్న మాజీ మాంత్రి బాలినేని వ్యవహారంపై సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు. నేడు మరొకసారి బాలినేనితో జగన్ సమావేశమయ్యారు. సీఎంఓ అందించిన సమాచారం ప్రకారం తాడేపల్లిలోని సీఎం కార్యాయానికి బాలినేని వచ్చి జగన్‌ను కలిశారు. ఇరువురు ఏకంతంగా చర్చించారు. ఇటీవల జరిగినపై పరిణామాలపై జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. జగన్ ముందు తన బాలినేని తన అసంతృప్తిని వెళ్లగక్కడంతో పాటు.. తన డిమాండ్లను ఉంచినట్లు సమాచారం. తనను ఇబ్బంది పెట్టిన వారిపై కూడా సీఎం జగన్‌కు బాలినేని ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే బాలినేనితో గతంలో జగన్ భేటీ అయ్యారు. అయినా అలక వీడకపోవడంతో తాజాగా మళ్లీ సమావేశం అయ్యారు. బహిరంగంగానే పార్టీ విబేధాలపై బాలినేని విమర్శలకు దిగడంతో సీఎం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వార్నింగ్ ఇచ్చేందుకే పిలిచారని ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటి ఏమీ లేదని బాలినేని ఇబ్బందులను పరిష్కారించే దిశగా జగన్ దృష్టి సారించారని పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాలోని రాజకీయ వర్గపోరు కారణంగా రీజనల్ కో-ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. అనంతరం కేవలం ఒంగోలు నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. పార్టీ కార్యాకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం లేదు. ఈ కారణంగానే బాలినేని మళ్లీ యాక్టివ్ చేసే విధంగా సీఎం చర్యలు చేపట్టారు. మరోసారి రిజనల్ కో-ఆర్డినేటర్ పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు సమావేశం నిర్వహిచినట్లు చర్చ జరుగుతోంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి..బాలినేనికి గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఇద్దరు సీఎం బంధువులు కావడం చర్చనీయంశమైంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.