TDP : టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి
X
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు , ఆయన కుమారులు రత్నాకర్, జై వీర్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో టీడపీ విజయం కోసం కృషి చేస్తామని మాజీ మంత్రి వీరభద్రరావు ఆయన తనయులు తెలిపారు. కాగా మంగళవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి వీరభద్రరావు పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు.
సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , ఎంపీ విజయసాయిరెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన వర్గీయులతో సమావేశమయ్యారు. అనంతరం అధికారికంగా తన రాజీనామా లేఖకు సీఎం జగన్‌ను పంపించారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని ప్రకటించిన ఆయన నేడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.