Home > ఆంధ్రప్రదేశ్ > AP HIGH COURT: హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు

AP HIGH COURT: హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు

AP HIGH COURT: హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు
X

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం జగన్‌ హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఇటీవల రిలీజ్ చేసిన కొలీజియంలో.. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని సూచించారు. దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నియామకానికి కేంద్ర న్యాయశాఖ అక్టోబర్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 న్యామూర్లుల పోస్టులకు గానూ 27 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు వేరే రాష్ట్రాలకు బదిలీ కాగా.. కర్నాటక జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కాగా కొత్తగా నియమితులైన న్యామూర్తులతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది.

Updated : 21 Oct 2023 1:46 PM IST
Tags:    
Next Story
Share it
Top