Home > ఆంధ్రప్రదేశ్ > దారుణం.. 4 వ తరగతి విద్యార్థిని హత్య చేసిన దుండగలు

దారుణం.. 4 వ తరగతి విద్యార్థిని హత్య చేసిన దుండగలు

దారుణం.. 4 వ తరగతి విద్యార్థిని హత్య చేసిన దుండగలు
X

ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో దారుణం జరిగింది. పులిరామన్న గూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటున్న నాలుగో తరగతి విద్యార్థి హత్యకు గురయ్యాడు. చనిపోయిన విద్యార్థి పేరు గోగుల అఖిల్ (9)గా తెలిసింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అఖిల్ ను ఎవరు.. ఎందుకు హత్య చేశారో.. కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థి హత్య జరిగినట్లు గమనించిన హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులకు విషయాన్ని తెలియజేశారు.

సమాచారం అందుకున్న బుట్టాయిగూడెం పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన తర్వాత.. కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. బాలుడి చేతిలో ఉత్తరం ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఉత్తరంలో ఏముందో ఇంకా వెలుగు చూడలేదు. బాలుడి ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. దీంతో బయటి వ్యక్తులు హత్య చేశారా? విద్యార్థే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మిగతా విద్యార్థులు మాత్రం రాత్రి ముగ్గురు విద్యార్థులను ఎవరు వచ్చి తీసుకువెళ్ళారని చెబుతున్నారు. అలా వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు తెల్లారేసరికి మృతదేహంగా మారాడు. అతనితో పాటు వెళ్లిన మరో ఇద్దరు విద్యార్థులు ఎవరని ఆరా తీస్తున్నారు.




Updated : 11 July 2023 10:56 AM IST
Tags:    
Next Story
Share it
Top