Kudumula Pedda Bayanna : రాయలసీమ చెంచు వీరుడికి అరుదైన గౌరవం
X
బ్రిటిష్ పాలన విముక్తికై దేశంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ ఉద్యమాలు వివిధ రూపాలు, వివిధ దశల్లో సాగాయి. అయితే అందులో కొన్ని ఉద్యమాలకు అంతగా గుర్తింపు దక్కలేదు. పలుచోట్ల గిరిజన తెగలు కూడా తెల్లదొరల పాలనపై తిరుగుబాటు చేశాయి. చెంచుల హక్కులు, ఆటవీ సంపద కోసం బ్రిటీష్ వారిపై పోరాడారు కుడుముల పెద్ద బయన్న. అయితే ఆయన అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఇటీవల ఆయన విగ్రహాన్ని తుమ్మబయలు గ్రామంలో ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు కుడుముల పెద్ద బయన్న పేరుతో ప్రత్యేక తపాలా కవర్ అందుబాటులోకి వచ్చింది. నంద్యాల పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఈ కవర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద బయన్న మునిమనవడు కుడుముల మూగన్న పాల్గొన్నారు. శ్రీశైలం అటవీ పరిధిలోని తుమ్మల బయలు గ్రామంలో జన్మించిన బయన్న.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని శ్రీనివాస రావు తెలిపారు. 1938న జరిగిన కాల్పుల్లో ఆయన మరణించారని.. కానీ ఇక్కడి ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని అన్నారు.