Home > ఆంధ్రప్రదేశ్ > గాజు గ్లాస్ గుర్తు జనసేనకే.. ఎన్నికల సంఘం ఉత్తర్వులు

గాజు గ్లాస్ గుర్తు జనసేనకే.. ఎన్నికల సంఘం ఉత్తర్వులు

గాజు గ్లాస్ గుర్తు జనసేనకే.. ఎన్నికల సంఘం ఉత్తర్వులు
X

గాజు గ్లాస్ గుర్తుపై జనసేన పడుతున్న టెన్షన్కు రిలీఫ్ దక్కింది. ఆ పార్టీకి ఏపీ ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కొనసాగిస్తూ ఏపీఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీచేసింది. జనసేనను రిజర్వుడు సింబల్‌ కలిగిన రిజిస్టర్డ్‌ పార్టీల జాబితాలోనే ఉంచింది. టీడీపీ, వైసీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో వాటి గుర్తులతో కొనసాగించింది.

బీఆర్ఎస్ కొత్త పేరు, వివరాలతో ఏపీఎస్‌ఈసీ వద్ద దరఖాస్తు చేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో చేర్చి కారు గుర్తు కొనసాగించనుంది. ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీని గుర్తింపు పొందిన జాతీయపార్టీగా, సీపీఐ, ఎన్సీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా జాబితాలో చేర్చింది. ప్రస్తుతం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీ జాబితాలో ఉన్న ఆర్‌ఎల్‌డీని రిజిస్టర్డ్‌ పార్టీల జాబితాలో చేర్చింది. ఈ పార్టీకి ఎలాంటి గుర్తు రిజర్వు చేయలేదు.





ఏపీలోని పార్టీలకు గుర్తుల కేటాయింపులపై కొంత కాలం క్రితం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలోని మూడు ప్రాంతీయ పార్టీలకు రిజర్వుడ్‌ గుర్తుల కేటాయింపు జరిగింది. ఏపీతో పాటుగా 8 జాతీయ పార్టీలకూ రిజర్వుడ్‌ గుర్తులు ఖరారు చేసింది. అయితే, వాటిలో జనసేన పార్టీ పేరు ప్రస్తావన లేదు. దీంతో..జనసేన సింబల్గా ఉన్న గాజు గ్లాసుపై ఆ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కాగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గ్లాస్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.


Updated : 24 Jun 2023 10:21 AM IST
Tags:    
Next Story
Share it
Top