Home > ఆంధ్రప్రదేశ్ > విజయవాడలో 6.4 కోట్ల బంగారం స్వాధీనం

విజయవాడలో 6.4 కోట్ల బంగారం స్వాధీనం

విజయవాడలో 6.4 కోట్ల బంగారం స్వాధీనం
X

విజయవాడలో భారీ స్థాయిలో అక్రమ బంగారం దొరికింది. చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న కారులో రూ. 6.4 కోట్ల విలువైన బంగారంతోపాటు నగదును కస్టమ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున తనిఖీ చేస్తుండగా కారులో 4.3 కిలోల బంగారం దొరికింది. రూ.1.5 లక్షల విలువైన విదేశీ కరెన్సీ కూడా లభించింది. బంగారాన్ని దుబాయ్, శ్రీలంకల నుంచి తీసుకొచ్చినట్లు తేల్చారు. ఈ స్మగ్లింగ్ వెనక అంతర్జాతీయ రాకెట్ సాగుతోందని చెప్పారు. వివరాలు బయటపడకుండా బంగారు బిస్కెట్లపై వివరాలను చెరిపేశారని పోలీసులు తెలిపారు. నిందితులను విశాఖపట్నంలోని ఆర్థిక నేరాల కోర్టుకరు హాజరుపర్చగా జడ్జి 13 రోజుల రిమాండ్‌కు పంపారు.



Updated : 26 Aug 2023 11:01 PM IST
Tags:    
Next Story
Share it
Top