Home > ఆంధ్రప్రదేశ్ > High Court : ఏపీ రైతులకు గుడ్‌న్యూస్..హైకోర్టులో భారీ ఊరట

High Court : ఏపీ రైతులకు గుడ్‌న్యూస్..హైకోర్టులో భారీ ఊరట

High Court : ఏపీ రైతులకు గుడ్‌న్యూస్..హైకోర్టులో భారీ ఊరట
X

ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు ఏపీ హైకోర్టు శుభవార్త చెప్పింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో రైతులకు భారీ ఊరట లభించింది. ఏపీ రాజధాని కోసం రైతులు భూములను ఇచ్చారు. ఆ సమయంలో వారికి సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్లాట్లను రద్దు చేసింది. దీంతో రైతులు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్లాట్లను రద్దు చేస్తున్నట్లు సీఆర్డీయే, రెవెన్యూ అధికారులు 862 మంది రైతులకు నోటీలిచ్చారు. దీంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

ప్లాట్ల రద్దు అన్యాయం అంటూ రాజధాని రైతులు ప్రభుత్వ నోటీసులను సవాల్ చేశారు. కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్లాట్లను రద్దు చేయడం అంటే సీఆర్డీయే చట్టాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్లాట్ల రద్దు నిర్ణయం రాజధాని మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, ఇంద్రనీల్ తమ వాదనలు వినిపించారు.

చట్టంలో మార్పులు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన ప్లాట్ల రద్దు నోటీసులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఏపీ రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated : 27 Feb 2024 5:23 PM IST
Tags:    
Next Story
Share it
Top