Home > ఆంధ్రప్రదేశ్ > CM Jagan : ఏపీ విద్యార్థులకు శుభవార్త.. నేడు ‘జగనన్న విద్యా దీవెన’ నగదు జమ!

CM Jagan : ఏపీ విద్యార్థులకు శుభవార్త.. నేడు ‘జగనన్న విద్యా దీవెన’ నగదు జమ!

CM Jagan :  ఏపీ విద్యార్థులకు శుభవార్త.. నేడు ‘జగనన్న విద్యా దీవెన’ నగదు జమ!
X

నేడు జగనన్న విద్యాదీవెన నిధులను ఏపీ సర్కార్ విడుదల చేయనుంది. సీఎం జగన్ నేడు కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించి ఆన్‌లైన్ మోడ్ ద్వారా నిధులను విడుదల చేయనున్నారు. 2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నగదును జమ చేస్తారు. ఈ పథకం కింద మొత్తం 9,44,666 మంది తల్లులు, విద్యార్థుల జాయింట్ అకౌంట్లలో నేరుగా రూ.708.68 కోట్లను జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీ సర్కార్ నేడు రూ.708.68 కోట్ల నగదును తల్లుల ఖాతాలో విడుదల చేయనుంది. దీంతో ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద మొత్తం రూ.18,002 కోట్ల నిధులను వినియోగించింది. ఇకపోతే రాష్ట్రంలో ఇప్పటికే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చేస్తున్న 93 శాతం మంది విద్యార్థులకు విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఇకపోతే డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.20 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలను ప్రతి విద్యా సంవత్సరంలో రెండు విడతలుగా, విద్యా సంవత్సరం మొదట్లో ఒకసారి, ఆఖర్లో ఒకసారి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి తెలిపారు. తల్లుల ఖాతాల్లో నగదు జమ అయిన తర్వాత వారం లేదా పది రోజుల్లో కళాశాలకు ఫీజు చెల్లించాలని, అలా చేయని పక్షంలో తదుపరి విడత ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును నేరుగా కళాశాలల ఖాతాలకు చెల్లిస్తామని హెచ్చరించారు.

Updated : 1 March 2024 7:52 AM IST
Tags:    
Next Story
Share it
Top