విద్యార్థులకు గుడ్ న్యూస్..6 లక్షల ట్యాబ్‌లు ఇవ్వనున్న ఏపీ సర్కార్
X
వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సార్కార్. ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కొత్త విద్యా సంవత్సరలో 8వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. స్టూడెంట్స్ తో పాటు టీచర్లకు ట్యాబ్‌లు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
గత ఏడాది ప్రభుత్వం విద్యార్థులకు, టీచర్లకు కలిపి 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా ఇచ్చింది. 8, 9 తరగతుల స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా రూ. 25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది. అంతేకాదు ఏమైనా సమస్యలు వచ్చినా మూడు రోజుల్లో పరిష్కారం అందించే విధంగా సర్కార్ ప్రత్యేక యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచింది. అదే విధంగా ట్యాబ్ ల నిర్వహణకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చింది.
సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లను స్పెషల్ గా తయారు చేయించారు. ఈ ట్యాబ్‌ల్లో నిక్షిప్తమైన కంటెంట్‌ను ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఉపయోగించుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా విద్యార్థి ఏ సబ్జెక్ట్‌ను ఎన్ని గంటలు చూశారు, దేనికి ఎక్కువ సమయం కేటాయించారు వంటి వివరాలు కూడా నమోదవుతుంది. ట్యాబ్‌లను ట్యాంపరింగ్ చేసే వీలు లేకుండా కట్టడి కూడా చేశారు. కంటెంట్‌ను డిలీట్ చేసే ప్రయత్నం చేసినా..మార్పులు చేసేందుకు యత్నించినా వెంటనే ట్యాబ్ లాక్ అవుతుంది. వెంటనే ఆ ట్యాబ్ వివరాలన్నీ కూడా ఇబ్రహీంపట్నంలోని స్టేట్ ఐటీ సెల్‌కు, విశాఖలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరిపోతాయి. ఆ తరువాత కారణాలు తెలుసుకుని ఓటీపీ ద్వారా జిల్లా నోడల్ అధికారి ట్యాబ్‌ను అన్‌లాక్ చేస్తారు.