వాలంటీర్లకు శుభవార్త..త్వరలో సీఎం జగన్ కీలక నిర్ణయం
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ.. నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్ల వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల కసరత్తులు సీఎం చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ 21న ముఖ్యమంత్రి పుట్టినరోజు కానుకగా అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ను అమలు చేస్తోంది. సర్కార్ అందించే అన్ని రకాల పథకాలను , రేషన్ సరుకులను ఇతర సేవలను వాలంటీర్లు ఇంటింటి తిరుగుతూ లబ్ధిదారులకు చేరవేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. గ్రామ స్థాయిలో 50 ఇళ్లకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో 100 ఇళ్లకు ఒకరు చెప్పున పని చేస్తున్నారు. ఇందుకు గాను వాలంటీర్లకు ప్రతి నెల రూ.5 వేలు వేతనం అందిస్తోంది. ప్రతి నెల ఒకటవ తారీఖున వారి అకౌంట్లలో జీతాలు వేస్తోంది. ఈ క్రమంలో వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం వాలంటీర్లకు ఓ గుడ్ న్యూస చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే వారి జీతాలు పెంచాలనే ఆలోచనలో సర్కార్ ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన సీఎం ఆర్ధిక శాఖతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అన్నీ కుదిరితే వాలంటీర్ల వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. సీఎం జగన్ బర్డ్ డే రోజైన డిసెంబర్ 21న ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం జనవరి నుంచి నుంచి పెరిగిన జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నారని ఇన్ఫర్మేషన్. గత కొంత కాలంగా ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం రేగడంతో వారి శాలరీల పెంపు విషయంలో సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోబోతోందన్న టాక్ వినిపిస్తోంది.