Jagan Mohan Reddy : వారికి గుడ్ న్యూస్.. నగదు బహుమతులు ప్రకటించిన ఏపీ సర్కార్
X
ఏపీలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు. అటువంటి వాలంటీర్లకు వైసీపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా నాలుగో ఏడాది వాలంటీర్లను సన్మానించేందుకు సిద్ధమైంది. కనీసం ఏడాది పాటు నిరంతరం పనిచేసిన వాలంటీర్లను గుర్తించి వారికి మూడు విభాగాల్లో నగదు బహుమతులను అధికారులు ఇవ్వనున్నారు.
ఫిబ్రవరి 15వ తేదిన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆరోజు నుంచి స్థానిక ఎమ్మెల్యేలు వారి పరిధిలోని వాలంటీర్లకు బహుమతులను అందించనున్నారు. 2019లో సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రస్తుతం 2.5 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.
వాలంటీర్లకు సాధారణ అవార్డులతో పాటుగా ప్రభుత్వ పథకాలపై వీడియోలు చిత్రీకరించే వారికి కూడా ప్రత్యేక నగదు బహుమతులను అందించనున్నారు. వైఎస్ఆర్ పెన్షన్, వైఎస్ఆర్ ఆసరా వంటి వివిధ పథకాలపై వాలంటీర్లు వీడియోలను చిత్రీకరించినట్లైతే అందులో ఉత్తమ వీడియోలకు ప్రత్యేక నగదు బహుమతిగా రూ.15 వేలను అందించనున్నారు. అలాగే ఆ చిత్ర నిర్మాతలకు రూ.20 వేల నగదును అందజేస్తారు. ఇలా జిల్లా స్థాయిలో వీడియోలు తీసిన 26 మందికి రూ.25 వేల ప్రత్యేక నగదును బహుమతిగా ఇవ్వనున్నారు.