Home > ఆంధ్రప్రదేశ్ > TTD : గుడ్‌న్యూస్..ఇక శ్రీవారి భక్తులకు మంగళసూత్రాలు!

TTD : గుడ్‌న్యూస్..ఇక శ్రీవారి భక్తులకు మంగళసూత్రాలు!

TTD : గుడ్‌న్యూస్..ఇక శ్రీవారి భక్తులకు మంగళసూత్రాలు!
X

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్ చెప్పింది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చేయించిన మంగళసూత్రాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి వాటిని భక్తులకు విక్రయించనుంది. మంగళసూత్రాలతో పాటుగా లక్ష్మీకాసులు సైతం తయారు చేసి అమ్మనున్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ భూమణ కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. ప్రత్యేకంగా చేయించే మంగళసూత్రాల గురించి టీటీడీ ఛైర్మన్ పలు విషయాలను మీడియాకు తెలిపారు.

ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారు చేసి భక్తులకు విక్రయిస్తామని కరుణాకర్‌రెడ్డి తెెలియజేశారు. బంగారు మంగళసూత్రాలను, లక్ష్మీ కాసులను తయారు చేయించిన తర్వాత వాటిని శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజ చేస్తామని, ఆ తర్వాత భక్తులకు విక్రయిస్తామని అన్నారు. మంగళసూత్రాలను 5 గ్రాములు, 10 గ్రాముల్లో తయారు చేస్తామన్నారు. వాటిని నాలుగు లేదా ఐదు డిజైన్లలో తయారు చేయనున్నట్లు వెల్లడించారు.

ఎటువంటి లాభాపేక్ష లేకుండా మంగళసూత్రాలను, లక్ష్మీకాసులను టీటీడీ ఆధ్వర్యంలో విక్రయించనున్నట్లు తెలిపారు. గతంలో 32 వేల మందికి టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిపించినప్పుడు మంగళసూత్రాలను అందించామన్నారు. మహిళలకు స్వామివారి కానుకగా అందించడం ఒక గొప్ప శుభసూచికమన్నారు. అదేబాటలో ఇప్పుడు మరో మెట్టు ముందుకు వేసి మహిళలకు మంగళసూత్రాలను, లక్ష్మీకాసులను అందించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఛైర్మన్ భూమణ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.





Updated : 30 Jan 2024 1:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top