Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో పట్టాలు తప్పిన ట్రైన్.. పలు రైళ్లు రద్దు

ఏపీలో పట్టాలు తప్పిన ట్రైన్.. పలు రైళ్లు రద్దు

ఏపీలో పట్టాలు తప్పిన ట్రైన్.. పలు రైళ్లు రద్దు
X

ఏపీ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు తాడి - అనకాపల్లి స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. తెల్లవారుజామున 3.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ మార్గంలో వెళ్లే రైళ్లను నిలిపేశారు. గూడ్స్ రైలు కావడంతో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు.

గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని ఆలస్యంగా నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. రద్దైన వాటిలో జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ రైళ్లు ఉన్నాయి.

అనకాపల్లి ఘటన ప్రభావం విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ పై పడింది. పట్టాల రిపేర్ కారణంగా ఈ ఎక్స్ ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడవనుంది. ఉదయం 5.45గంటలకు విశాఖ నుంచి బయల్దేరాల్సిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఉదయం 8.45కు బయలుదేరనుంది. దీంతో పాటు మరికొన్ని రైళ్ల రాకపోకల సమయంలో అధికారులు మార్పులు చేశారు.




Updated : 14 Jun 2023 3:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top