చంద్రబాబు అరెస్ట్.. టీడీపీ భవిష్యత్పై రాజాసింగ్ సంచలన కామెంట్స్..
X
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును చూసి ఏపీసీఎం జగన్ భయపడుతున్నారని అన్నారు. అందుకే తప్పుడు మార్గంలో అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రజల కోసమే బాబు జైలుకు వెళ్లారని.. ఆయనపై పెట్టిన కేసును కోర్టు కొట్టేస్తుందని చెప్పారు. 2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. జగన్ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఆయనకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విమర్శించారు.
మరోవైపు సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ సైతం స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుపై స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయన్నారు. స్కిల్ కేసుపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమేనని స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినపుడు సరైన విచారణ జరిపాక కేసు పెట్టాల్సి ఉండగా.. కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లు ఉందని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200 లకు పైగా ల్యాబ్ లను ప్రారంభించినట్లు తెలిపారు. ఒక్క శిక్షణ కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని ఎలా తేల్చేస్తారని ప్రశ్నించారు.