Home > ఆంధ్రప్రదేశ్ > మెగాస్టార్ చిరంజీవికి కొడాలి నాని కౌంటర్

మెగాస్టార్ చిరంజీవికి కొడాలి నాని కౌంటర్

మెగాస్టార్ చిరంజీవికి కొడాలి నాని కౌంటర్
X

ఏపీ రాజకీయాలు సినిమాలు చుట్టు తిరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ బ్రో సినిమాతో చెలరేగిన వివాదం కాస్త ముదురుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చిరు వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పరోక్షంగా సమాధానమిచ్చారు. " సినీ పరిశ్రమలో చాలా మంది పకోడీగాళ్లు మాకు సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో ఆ పకోడీగాళ్లు చెబుతారు. ఆ విషయం ఏదో తమ వాళ్లకు కూడా సలహాలిస్తే బాగుంటుంది. మనకెందుకురా బాబూ రాజకీయాలు, మన డ్యాన్సులు, ఫైట్లు మనం చూసుకుందాం" అని తమ వాళ్లకు కూడా చెబితే మంచిదంటూ కొడాలి హితవు పలికారు.

చిరంజీవి ఏమన్నారంటే..




వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్‍లో మెగాస్టార్ చిరంజీవి ఏపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై ,ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టిపెట్టాలంటూ జగన్ సర్కార్ కు చిరంజీవి సూచించారు. ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే అంతా తలవంచి నమస్కరిస్తారని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు వైసీపీకి అనుకూలంగా, సీఎం జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యంగా ఉన్న మెగస్టార్ ఇప్పుడు రివర్స్ కావడం చర్చనీయాంశమవుతోంది.

బ్రో సినిమాతో వివాదం..





బ్రో సినిమాలో తనను అనుకరించిన విధానంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్, బ్రో సినిమాపై అంబటి తీవ్ర విమర్శలు చేశారు. బ్రో సినిమా ద్వారా పవన్ కు చంద్రబాబు ప్యాకేజీ అందించారని ఆయన ఆరోపించారు. దమ్ముంటే పవన్ తన రెమ్యూనరేషన్ ఎంతో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. బ్రో సినిమా పై ఫిర్యాదు చేయడానికి అంబటి ఢిల్లీ కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


Updated : 8 Aug 2023 10:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top