Home > ఆంధ్రప్రదేశ్ > Panipuri : గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేత..డయేరియా ఎఫెక్ట్

Panipuri : గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేత..డయేరియా ఎఫెక్ట్

Panipuri : గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేత..డయేరియా ఎఫెక్ట్
X

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీరు కలుషితమయ్యే అన్ని ప్రాంతల్లోనూ సంరక్షణ చర్యలు చేపట్టారు. అలాగే పానీపూరిలో ఉపయోగించే నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉండటంతో వాటి విక్రయాలను నిలిపివేశారు. 10 రోజులు పాటు అమ్మకాలు చేయొద్దని జీఎంసీ శానిటరీ సూపర్వైజర్ ఆయుబ్ ఆదేశించారు. పలు పానీపూరి బండ్లపై దాడులు చేసి, అందులో నీటిని పారబోయించారు. జిల్లాలో డయేరియా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు డయేరియాతో నలుగురు మృత్యువాతపడ్డారు.

వందల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పలువురు బాధితులు చికిత్స పొందుతున్నారు. నగరంలో విజృంభిస్తోన్న డయేరియాపై ఏపీ హైకోర్టు స్పందించింది. డయేరియా లక్షణాలతో మృతి చెందిన వారి వివరాలను పరిశీలించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర న్యాయాధికార సంస్థను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో న్యాయాధికార సంస్థ జడ్జి లీలావతి జీజీహెచ్‌ లో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం వారికి అందుతున్న చికిత్స, అనారోగ్యానికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని తాగడానికి ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డయేరియా కేసుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు అధికారులు వాస్తవాలను తొక్కిపెడుతున్నారంటూ టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Updated : 22 Feb 2024 3:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top