Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఇవాళ సుప్రీంలో విచారణ
X
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ సుప్రీం విచారణ జరపనుంది. శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను విన్నది. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు మరోసారి విచారణ చేపడతామని సుప్రీం తెలిపింది. నేరం ఐదేళ్ల క్రితం జరిగినా ఎఫ్ఐఆర్ ఇప్పుడు నమోదు చేయొచ్చని.. 17ఏ అనేది అవినీతికి రక్షణ కాకూడదని సీఐడీ తరుపు అడ్వకేట్ వాదించారు.అయితే ఈ కేసులో 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరుపు లాయర్లు వాదించారు.
ఈ కేసులో ఇవాళ్టితో వాదనలు ముగుస్తాయని తెలుస్తోంది. అయితే కోర్టు వెంటనే తీర్పునిస్తుందా.. లేక రిజర్వ్ చేస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 20 నుంచి సుప్రీం కోర్టుకు దసరా సెలవులు కావడంతో ఆ లోపే తీర్పు రావొచ్చని సమాచారం. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సైతం ఇవాళే విచారణ ఈ కేసులోనూ 17ఏను పరిగణనలోకి తీసుకోలేదని చంద్రబాబు తరుపు న్యాయవాది లూథ్రా వాదించారు. ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్, ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చినప్పుడు చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలని కోరారు.