Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

Chandrababu : నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

Chandrababu : నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ
X

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓ వైపు పొత్తులపై కసరత్తు జరుగుతుంటే మరోవైపు అభ్యర్థుల ఎంపికపై పార్టీలన్నీ బీజీగా ఉంటున్నాయి. వైసీపీని ఎలాగైనా ఓడించాలని టీడీపీ, జనసేన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే నేడు సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

సీఐడీ పిటిషన్‌పై సుప్రీం కోర్టు నేడు విచారణ జరపనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం సీఐడీ పిటిషన్‌ను విచారించనుంది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ తమ పిటిషన్‌లో తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని తెలిపింది.

వెంటనే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఏపీ సీఐడీ అధికారులు కోరారు. జనవరిలో 19వ తేదిన ఈ కేసుకు సంబందించి విచారణ జరిగింది. ఆ సందర్భంగా కౌంటర్ దాఖలుకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. దీంతో ఇరుపక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది. నేడు దీనిపై వాదనలు వినిపించనున్నారు.


Updated : 12 Feb 2024 10:35 AM IST
Tags:    
Next Story
Share it
Top