Home > ఆంధ్రప్రదేశ్ > ప్రకాశం బ్యారేజ్‎కి పోటెత్తిన వరద.. 70 గేట్ల నుంచి నీరు విడుదల

ప్రకాశం బ్యారేజ్‎కి పోటెత్తిన వరద.. 70 గేట్ల నుంచి నీరు విడుదల

ప్రకాశం బ్యారేజ్‎కి పోటెత్తిన వరద.. 70 గేట్ల నుంచి నీరు విడుదల
X

బెజవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. బ్యారేజీ 70 గేట్లను ఎత్తి వరద నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ దగ్గర 12 అడుగుల నీటిమట్టాన్ని నిల్వ చేస్తూ అదనంగా వచ్చే వరద నీటిని వదులుతున్నారు. అదే విధంగా డెల్టా కాలువలకు పూర్తిగా నీటి సప్లైను ఆమెశారు. అధికారులు గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తలేదు. 50 గేట్లను 6 అడుగులు మేర ఎత్తగా.. 20 గేట్లను 5 అడుగులు ఎత్తి నీటిని పంపిస్తున్నారు. ఇప్పటివరకు 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామాలకు , నదీ పరివాహక ప్రాంత ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.





ఇటు మరోవైపు మునేరు కూడా మహోగ్రంగా ప్రవహిస్తోంది. ప్రమాదస్థాయిని మించి వరద నీరు వచ్చి చేరుతోంది. కీసర వంతెన దగ్గర నీరు రహదారుల మీదకు చేరడంతో విజయవాడ- హైదరాబాద్‌ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఐతవరం గ్రామాల మధ్య ఉన్న జాతీయ రహదారిపై సుమారు 2 అడుగు మేర మునేరు పొంగుతోంది.




Updated : 28 July 2023 6:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top