ఆకాశం నుంచి తిరుపతి అందాలు.. 6వేలకే హెలికాప్టర్ జాయ్ రైడ్
X
మీరు తిరుపతి వెళ్తున్నారా.. అక్కడి అద్బుత ప్రదేశాలను ఆకాశం నుంచి చూడాలనుకుంటున్నారా.. అయితే కోరిక తీరబోతేంది. కాకపోతే కొంచెం ఖర్చు చేయాల్సివుంటుంది. ఏరో డాన్ అనే సంస్థ తిరుపతి, చంద్రగిరి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను ఆకాశం నుంచి చూసేందుకు హెలికాఫ్టర్ జాయ్ రైడ్‌ని తీసుకొచ్చింది. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజులు ట్రైల్ నిర్వహించనున్నారు. ఈ హెలీకాఫ్టర్లో పైలట్ కాకుండా ఐదుగురు పర్యాటకులు ఎక్కే వీలు ఉంటుంది.
ఈ జాయ్ రైడ్ 8 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనికోసం ఒక్కరు 6వేలు చెల్లించాల్సి ఉంటుంది. గంటకు 6 ట్రిప్పులు వేసేలా ఏరోడాన్ ప్రణాళికలు రూపొందించింది. రైడ్లో భాగంగా తిరుపతి నుంచి చంద్రగిరి కోట వరకు తీసుకెళ్లి.. తిరిగి తిరుపతి తీసుకువస్తారు. శ్రీవారి భక్తులే కాకుండా తిరుపతి వాసులు కూడా ఈ హెలికాప్టర్ రైడ్ను ఆస్వాదించవచ్చని ఏరో డాన్ సంస్థ చెబుతోంది. టికెట్ బుకింగులు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.