Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ముందస్తు బెయిల్ పిటిషన్లపై..

Chandrababu : చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ముందస్తు బెయిల్ పిటిషన్లపై..

Chandrababu : చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ముందస్తు బెయిల్ పిటిషన్లపై..
X

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జరిపిన న్యాయస్థానం బాబు పిటిషన్లను డిస్మిస్ చేసింది. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. ఈ క్రమంలో మిగితా మూడు కేసుల్లో డిమ్డ్ కస్టడీగా చూడాలన్న బాబు లాయర్ల వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇదే కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో పాటు మరోసారి పోలీసు కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం.. ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై శుక్రవారమే ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి.


Updated : 9 Oct 2023 5:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top