Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబుకు హైకోర్టు షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత..

చంద్రబాబుకు హైకోర్టు షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత..

చంద్రబాబుకు హైకోర్టు షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టివేత..
X

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. ఈ కేసులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. సీఐడీ తరుపు లాయర్ల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఐడీ కస్టడీ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు కాసేపట్లో తీర్పునివ్వనుంది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు చంద్రబాబు రిమాండ్ను ఏసీబీ కోర్టు ఈ నెల 24వరకు పొడగించింది. దీంతో అప్పటివరకు బాబు రాజమండ్రి జైల్లోనే ఉండనున్నారు. అంతకుముందు సీఐడీ కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాన్ని జడ్జి తెలుసుకున్నారు. ‘‘మిమ్మల్ని కస్టడికి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. కానీ మీ లాయర్లు కస్టడీ ఒద్దని వాదించారు’’ అని బాబుతో జడ్జి అన్నారు. అయితే తనను రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారని.. చేయని తప్పును చేశానని చెబుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు దీన్ని శిక్షగా భావించొద్దని.. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే అని.. నేర నిరూపణ కాలేదని జడ్జి చెప్పారు.


Updated : 22 Sept 2023 2:06 PM IST
Tags:    
Next Story
Share it
Top